ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నారాయణరావుపై దాడి దారుణం: పవన్ కల్యాణ్

ABN, First Publish Date - 2020-07-14T23:02:59+05:30

విజయనగరం బీజేపీ నాయకుడు కాళ్ళ నారాయణరావుపై అధికార పక్షం గూండాలు కత్తులతో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విజయనగరం బీజేపీ నాయకుడు కాళ్ళ నారాయణరావుపై అధికార పక్షం గూండాలు కత్తులతో దాడి చేయడం దారుణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య పనులు చేయిస్తుంటే వాలంటీర్ల ద్వారా వైసీపీ నాయకులు అడ్డుకున్నట్లు తెలిసిందని పవన్ పేర్కొన్నారు. నారాయణరావుతో పాటు అతని కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడటం అధికార పార్టీ దౌర్జన్య పూరిత ధోరణిని తెలియచేస్తోందన్నారు. 


ఈ దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం వల్లే హత్యాయత్నానికి ఒడిగట్టారని పవన్  మండిపడ్డారు. తక్షణమే ఘటనపై డీజీపీ సమగ్ర విచారణ చేపట్టాలని పవన్ సూచించారు. వైసీపీ వాళ్లు ఎలాగూ చేయడం లేదని... స్వచ్ఛందంగా పారిశుద్ధ్య నిర్వహణ చేసిన వారిపై అధికార పార్టీ గూండాలు కత్తులతో దాడులకు తెగబడటం ఏ నైజాన్ని వెల్లడిస్తుందో ప్రజాస్వామ్యవాదులు గుర్తించాలని పవన్ సూచించారు. 



Updated Date - 2020-07-14T23:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising