ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదంపై జనసేనాని స్పందన ఇది..!

ABN, First Publish Date - 2020-08-01T02:58:17+05:30

ఏపీలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడు రాజధానులకు ఇది సమయం కాదు: పవన్ కల్యాణ్

అమరావతి: ఏపీలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు(మూడు రాజధానుల బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదముద్ర వేశారు. దీంతో.. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియపై ఆగమేఘాల మీద అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో.. ఈ అంశంపై బీజేపీలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్న వేళ ఆ పార్టీతో జత కట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు స్పందించారు. మూడు రాజధానులకు ఇది సమయం కాదని, ముందు ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు.


గుజరాత్ రాజధాని గాంధీ నగర్, చత్తీస్ గడ్ రాజధాని రాయఘడ్‌ను సుమారు మూడున్నర వేల ఎకరాలలోనే నిర్మించారని పవన్ తన ప్రకటనలో చెప్పుకొచ్చారు. 33 వేల ఎకరాలు కావాల్సిందేనని జగన్ శాసనసభలో గట్టిగా మాట్లాడారని, రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు అవసరం లేదని చెప్పింది ఒక్క జనసేన పార్టీ మాత్రమేనని పవన్ చెప్పారు. రెండు బిల్లులు గవర్నర్ ఆమోదం పొందిన తరుణంలో ఉత్పన్నమయ్యే రైతుల పరిస్థితిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తామని పవన్ వెల్లడించారు. రైతుల పక్షాన జనసేన తుదికంటూ పోరాడుతుందని హామీ ఇచ్చారు.



Updated Date - 2020-08-01T02:58:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising