జనసేన నేతలతో పవన్ టెలికాన్ఫరెన్స్
ABN, First Publish Date - 2020-03-17T00:17:48+05:30
జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో హింసపై మౌనంగా ఉంటే మరింత పెట్రేగుతారని
అమరావతి: జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో హింసపై మౌనంగా ఉంటే మరింత పెట్రేగుతారని, నామినేషన్ దశలో ఎదురైన ఇబ్బందులు, దాడులపై సమాచారం ఇవ్వాలన్నారు. దాడులు చేసి ఇబ్బందులు పెడుతున్నా రక్షించని అధికారుల వివరాలు తెలపాలని కోరారు. పూర్తి నివేదికను కేంద్ర హోంశాఖకు స్వయంగా అందజేస్తామని, ఎన్నికల ప్రచారంలో మృతి చెందిన అర్జునరావు కుటుంబానికి లక్ష ఆర్థికసాయం అందిస్తామని పవన్ ప్రకటించారు.
Updated Date - 2020-03-17T00:17:48+05:30 IST