ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాడేపల్లి ప్యాలెస్‌లో విలాసాల కోసం కోట్లు ఖర్చు పెట్టారు: పట్టాభిరామ్

ABN, First Publish Date - 2020-06-25T18:48:28+05:30

అమరావతి: ఏపీలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన కొనసాగిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన కొనసాగిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. కక్ష సాధింపు ధోరణితో ప్రజావేదికను జగన్ కూల్చివేయించారన్నారు. జగన్ ఏడాది పాలనంతా విధ్వంసాలు, కూల్చివేతలేనన్నారు. ఏడాది కాలంలో ఒక్క నిర్మాణమైన జగన్ చేపట్టారా? అని పట్టాభిరామ్ ప్రశ్నించారు. ప్రజావేదిక కూల్చి రూ.9 కోట్ల ప్రజాధనం వృథా చేశారన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో విలాసాల కోసం కోట్లు ఖర్చు పెట్టారన్నారు.


ప్రజావేదిక దగ్గరకు వచ్చిన ప్రజలకు నాడు చంద్రబాబు భోజనం పెట్టి పంపేవారన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌కు ప్రజలు రాకుండా జగన్ 144 సెక్షన్ పెట్టారని పట్టాభిరామ్ విమర్శించారు. అచ్చెన్నాయుడిని వైసీపీ ప్రభుత్వం చంపేయాలనుకుంటోందా? అని ప్రశ్నించారు. 108 కుంభకోణాన్ని బయటపెడితే ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందన్నారు. న్యాయవ్యవస్థను తప్పుదారి పట్టించేందుకు వైసీపీ యత్నిస్తోందన్నారు. అధికారం శాశ్వతం కాదని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. జగన్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని పట్టాభిరామ్ పేర్కొన్నారు.

Updated Date - 2020-06-25T18:48:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising