ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా ప్రభుత్వం ఆ కంపెనీకి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు: జగన్

ABN, First Publish Date - 2020-05-18T22:37:16+05:30

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై సోమవారం విశాఖలో మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ ఘటన జరిగిన తర్వాత మంత్రులు, అధికారులు యుద్ధ ప్రాతిపదికన బాధితులకు సేవలు అందించారని కొనియాడారు. కంపెనీలో ఉన్న 13వేల టన్నుల కెమికల్స్‌ను రెండు షిప్పుల ద్వారా తరలించడం గొప్ప విషయమన్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని జగన్ స్పష్టం చేశారు.


గత ప్రభుత్వం అంటే 1996లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కంపెనీకి అనుమతులు ఇచ్చారని జగన్ అన్నారు. అలాగే 2015లో కూడా టీడీపీ ప్రభుత్వం ఆ కంపెనీకి సంబంధించి అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు. అయినా రాజకీయంగా ఎక్కడా విమర్శించలేదన్నారు. ఇప్పుడు ఏం చేయాలన్నదానిపైనే దృష్టి పెట్టామని జగన్ వ్యాఖ్యానించారు. ఎక్కడా దేశంలో లేని విధంగా మృతుల కుటుంబాలకు 10 రోజుల్లోనే రూ. కోటి ఎక్స్ గ్రేషియ ఇచ్చామన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు అన్ని సదుపాయాలు కల్పించి వారికి కూడా లక్ష రూపాయలు, వెంటిలేటర్‌పై చికిత్స పొందినవారికి రూ. 10 లక్షలు ఇచ్చామని, భాదిత గ్రామాల్లో ప్రజలందరికి రూ. 10 వేలు చొప్పున అందజేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2020-05-18T22:37:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising