నగ్న వీడియోల వ్యవహారంలో యువతుల పాత్ర
ABN, First Publish Date - 2020-06-29T02:20:25+05:30
గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్ధిని అత్యాచారం కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. యువతి అత్యాచారంతోపాటు ఆమె నగ్న వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంలో ఇద్దరు యువతుల పాత్ర ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో... ఆ యువతులపై కూడా కేసులు నమోదు కానున్నాయి.
గుంటూరు : గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్ధిని అత్యాచారం కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. యువతి అత్యాచారంతోపాటు ఆమె నగ్న వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంలో ఇద్దరు యువతుల పాత్ర ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో... ఆ యువతులపై కూడా కేసులు నమోదు కానున్నాయి.
ఇంజనీరింగ్ విద్యార్ధినిపై ఇద్దరు సహ విద్యార్ధులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా... రెండేళ్ళ నుంచి ఆ విద్యార్ధిని చిత్రాలను పోర్న్ సైట్‌లలో పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ వ్యవహారంలో కౌశిక్, వరుణ్‌తేజ్ అనే ఇద్దరు యువకులనేు పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
కాగా ఈ కేసును పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే... ఈ కేసు విచారణ పూర్తైతే... మరిన్ని సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
Updated Date - 2020-06-29T02:20:25+05:30 IST