ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ నిబంధనలు ప్రకారమే బస్సులు నడుపుతాం: బ్రహ్మానందరెడ్డి

ABN, First Publish Date - 2020-06-19T00:11:31+05:30

అంతర్ రాష్ట్ర సర్వీసులపై ప్రాథమిక చర్చలు జరిగాయని ఏపీఎస్‌ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య 4 దశల్లో ఆపరేషన్స్ స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అంతర్ రాష్ట్ర సర్వీసులపై ప్రాథమిక చర్చలు జరిగాయని ఏపీఎస్‌ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య 4 దశల్లో ఆపరేషన్స్  స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తొలుత 256 సర్వీసులు ఏపీ నుండి తెలంగాణకు నడపాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. వచ్చే వారంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య  అంతర్ రాష్ట్ర సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. కిలోమీటర్ ప్రాతిపదికగా అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించామని, మరోసారి భేటి ఉంటుందని బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. భేటి అనంతరం ఒప్పందంపై మరింత స్పష్టత వస్తుందన్నారు. కోవిడ్ నిబంధనలు ప్రకారమే బస్సులు నడుపుతామని, ప్రోటోకాల్ తప్పక పాటిస్తామని తెలిపారు. విభజన జరిగినపుడు ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ అమలు కాలేదని, దాని మీద కూడా చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. అంతర్ రాష్ట్ర ఒప్పందం ప్రకారం బస్సులు నడపాలని ఇరురాష్ట్రాల ఆర్టీసీలు నిర్ణయించాయని బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2020-06-19T00:11:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising