ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమనీయం.. కోదండరాముని కల్యాణం

ABN, First Publish Date - 2020-04-08T09:24:07+05:30

కమనీయం.. కోదండరాముని కల్యాణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణం మంగళవారం రాత్రి పున్నమి చంద్రుడి సమక్షంలో నిరాడంబరంగా నిర్వహించారు. స్వామికి పట్టువస్త్రాలను జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శంకర్‌బాలాజీ, ముత్యాల తలంబ్రాలను డిప్యూటీ ఈవో లోకనాథం సమర్పించారు. చతుర్వేద పఠనం చేసిన వేదపండితులు సీతారాముల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు.


అనంతరం మంగళవాయిద్యాల మధ్య రాత్రి 8.38గంటలకు అష్టనక్షత్ర యుక్త శుభలగ్నంలో సీతమ్మ తల్లి మెడలో శ్రీరామచంద్రుడు మంగళసూత్రధారణ చేశారు. లాక్‌డౌన్‌ దృష్ట్యా కల్యాణోత్సవానికి ముందు పోలీసులు ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. టీటీడీ అధికారులు, వేదపండితులు మినహా ఎవ్వరినీ లోపలకు అనుమతించకుండా ఆలయ ముఖద్వారాన్ని మూసిపహారా కాశారు. కల్యాణం అనంతరం రాత్రి గజవాహనంపై కోదండరాముడు ఊరేగాడు.

- రాజంపేట/ఒంటిమిట్ట



Updated Date - 2020-04-08T09:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising