ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురంలో వృద్ధుడు మృతి.. వైద్యం చేసిన డాక్టర్లలో ఆందోళన

ABN, First Publish Date - 2020-04-10T17:51:43+05:30

అనంతపురం : జిల్లాలో ఓ వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందాడు. చనిపోయిన తర్వాత ఆయనకు కరోనా ఉన్నట్లు తేలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం : జిల్లాలో ఓ వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందాడు. చనిపోయిన తర్వాత ఆయనకు కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో ఆయనకు ఇన్నిరోజులూ చికిత్స అందించిన డాక్టర్లు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. మరోవైపు అసలు ఈయనకు కరోనా ఎక్కడ్నుంచి వచ్చింది..? అసలేం జరిగింది..? అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 


ఇదిలా ఉంటే.. జిల్లాలోని కొత్తచెరువులో ముగ్గురికి కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో ఐసోలేషన్‌కు తరలించారు. ఆ అనుమానితుల్లో ఓ ప్రభుత్వ డాక్టర్, ఆర్ఎంపీ వైద్యుడు ఉన్నారు. వారిని హిందూపురం ఐసోలాషన్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు.


కాగా.. రోజురోజుకూ అనంతలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇవాళ ఒక్కరోజే రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్‌లో ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకూ జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15. ఇదిలా ఉంటే.. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కు చేరింది. ఏపీలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందగా.. 10మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Updated Date - 2020-04-10T17:51:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising