ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైజాగ్‌లో ‘ఓలా’ కార్యకలాపాలు షురూ..!

ABN, First Publish Date - 2020-05-05T23:28:55+05:30

నగరాన్ని ఆరెంజ్ జోన్‌గా ప్రకటించడంతో, ఆన్‌లైన్ ట్యాక్సీ బుకింగ్ సంస్థ ఓలా, నేడు నగరంలో తమ క్యాబ్ కార్యకలాపాలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైజాగ్: నగరాన్ని ఆరెంజ్ జోన్‌గా ప్రకటించడంతో, ఆన్‌లైన్ ట్యాక్సీ బుకింగ్ సంస్థ ఓలా, నేడు నగరంలో తమ క్యాబ్ కార్యకలాపాలను పునరుద్ధరించింది. అయితే సురక్షిత జోన్లుగా ప్రకటించిన ప్రాంతాలలో మాత్రమే తమ సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. తమ డ్రైవర్లందరూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారని, ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు కూడా వాహనంలో ఎక్కే సమయంలో, దిగే సమయంలో తప్పనిసరిగా ఓ సెల్ఫీ దిగి అప్‌లోడ్ చేయవలసి ఉంటుందని తెలిపింది. ప్రయాణికులకు పరిశుభ్రమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చిన వెంటనే వాహనాన్ని పూర్తిగా శానిటైజ్ చేయడం జరుగుతుందని వివరించింది. అయితే సులభతరమైన క్యాన్సిలేషన్ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. వాహనం డ్రైవర్ మాస్కు ధరించకున్నా, తగిన నిబంధనలు పాటించకపోయినా వెంటనే క్యాన్సిల్ చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించామని, అదే రీతిలో ప్రయాణికులు నిబంధనలు పాటించకపోతే డ్రైవర్ కూడా క్యాన్సిల్ చేసుకునే వీలుంటుందని ఓలా వెల్లడించింది. దీనికోసం  'సురక్షిత సవారీకి 10 అడుగులు' అనే విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. వీటిని తప్పనిసరిగా డ్రైవర్లు, ప్రయాణికులు పాటించాలని సూచించింది.


డ్రైవర్లు పాటించాల్సిన నిబంధనలు..

రెడ్ జోన్లలో ఓలా క్యాబ్‌ల ప్రయాణం చేయరాదు: ప్రభుత్వం గుర్తించిన రెడ్ జోన్ల లోపలకు లేదా వెలుపలకు ఓలా క్యాబ్స్‌ను నడుపరాదు.

డ్రైవర్లకు సెల్ఫీ అథెంటికేషన్: డ్రైవర్ భాగస్వాములందరూ ఖచ్చితంగా మాస్కులను ధరించడంతో పాటుగా తమ ప్రతి సవారీ ఆరంభంలో సెల్ఫీని డ్రైవర్ పార్టనర్ యాప్ ద్వారా ఆథీకృతం చేయాల్సి ఉంటుంది.

కార్లలో తప్పనిసరిగా పరిశుభ్రతా కిట్స్ ఉండాలి: డ్రైవర్ భాగస్వాములకు మాస్కులు, శానిటైజర్లు మరియు క్రిమిసంహారకాలు అందిస్తారు. తమ సంబంధిత నగరాల్లో వీటిని వాక్-సెంటర్ల వద్ద నుంచి రీ-స్టాక్ చేసుకోవచ్చు.

తరచుగా కార్లను శుభ్రపరచాలి: హ్యాండిల్, ఇన్నర్ హ్యాండిల్ మరియు సీటులాంటి సాధారణ ఉపరితలాలను ప్రతి సవారీకి ముందు తప్పనిసరిగా శుభ్రపరచాలి.

అనుకూలమైన క్యాన్సిలేషన్స్: తమతో పాటుగా ప్రయాణించగోరు ప్రయాణీకులు మాస్కులను ధరించని ఎడల తమ భద్రతతో పాటుగా తరువాత సవారీ చేయగోరు వారి భద్రతకు సైతం భరోసా కల్పిస్తూ డ్రైవర్ భాగస్వాములు తమ సవారీని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది.


ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలు..

మాస్కులను తప్పనిసరిగా ధరించాలి: ప్రతి సవారీకి ముందు మరియు ఆ తరువాత ప్రతి వినియోగదారుడూ తప్పని సరిగా మాస్కులను ధరించడంతో పాటుగా శానిటైజ్ చేసుకోవాలి.

ఏసీలను వినియోగించరాదు: గాలి రీ సర్క్యులేట్ కాకుండా ఉండేందుకు, ఏసీను పూర్తిగా ఆఫ్ చేయడంతో పాటుగా కిటికీలను తెరిచి ఉంచాలి.

కారులో ఇద్దరు మాత్రమే ప్రయాణం: డ్రైవర్ భాగస్వామితో పాటుగా కేవలం ఇద్దరు ప్రయాణీకులు మాత్రమే ఒక్కో క్యాబ్‌లో ప్రయాణించడానికి అనుమతిస్తారు

లగేజీని తమంతట తాము లోపల /బయట పెట్టుకోవాలి: భౌతిక దూరం పాటించడంలో సహాయపడేందుకు, వినియోగదారులు తమంతట తాముగా సామాన్లును కారు లోపల/బయట పెట్టుకోవాల్సిందిగా కోరడమైనది.

నగదు రహిత చెల్లింపులు: అవాంచిత కాంటాక్ట్‌ను నిరోధించడానికి ప్రయాణికులను నగదు రహిత చెల్లింపులకు ప్రోత్సహించడమైనది.

Updated Date - 2020-05-05T23:28:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising