ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూజివీడు ట్రిపుల్ ఐటీ వ్యవహారంపై స్పందించిన వీసీ

ABN, First Publish Date - 2020-02-23T03:37:20+05:30

నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీలో జరిగిన ఘటనపై వైస్ ఛాన్సలర్ హేమ చంద్రారెడ్డి స్పందించారు. సెక్యూరిటీ వైఫల్యం కారణంగానే యువకుడు లేడీస్ హాస్టల్‌లోకి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: నూజివీడు ట్రిపుల్ ఐటీ కాలేజీలో జరిగిన ఘటనపై వైస్ ఛాన్సలర్ హేమ చంద్రారెడ్డి స్పందించారు. సెక్యూరిటీ వైఫల్యం కారణంగానే యువకుడు లేడీస్ హాస్టల్‌లోకి  వెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు. ‘‘పిల్లల భవిష్యత్ పాడవుతుందనే మౌనంగా ఉన్నాం.లోపల నుండి కిటికీ ఓపెన్ చేయటం సులువు. బయట నుండి కష్టం. లోపల ఉన్న వ్యక్తే కిటికీ ఓపెన్ చేశారు. ఫెస్ట్ జరుగుతున్న సమయంలో అమ్మాయి ఒక్కటే రూమ్‌లో ఉంది. ఫెస్ట్ సమయంలో అమ్మాయి కిటికీ ఓపెన్ చేసింది. దాని గుండా అబ్బాయి లోపలికి వెళ్లాడు. ఉదయం నలుగురు అమ్మాయిల్లో ఒక అమ్మాయి మంచం కింద ఎవరో ఉన్నారు అని గుర్తించి వార్డెన్‌కి ఫిర్యాదు చేసింది. 4500 మంది అమ్మాయిలు..3500 అబ్బాయిలు ఈ IIIT‌లో ఉన్నారు. అబ్బాయి, అమ్మాయి మైనర్ కావటంతో ఆ ఇద్దరిని తల్లిదండ్రులు దగ్గరకి పంపాం. ఈ ఘటనపై క్రమశిక్షణ కమిటీకి సిఫార్సు చేశాం. పిల్లల భవిష్యత్ దృష్ట్యా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.’’ అని వైస్ ఛాన్సలర్ హేమ చంద్రారెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-02-23T03:37:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising