విలేకరులకు నో ఎంట్రీ!
ABN, First Publish Date - 2020-08-22T09:22:46+05:30
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండల పరిషత్ కార్యాలయం లోపలకు విలేకరులను రానీయకుండా ఎంపీడీవో ఆంక్షలు విధించారు.
పెదవేగి, ఆగస్టు 21: పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండల పరిషత్ కార్యాలయం లోపలకు విలేకరులను రానీయకుండా ఎంపీడీవో ఆంక్షలు విధించారు. దీనికి కారణమేంటని ఆరా తీస్తే.. రాట్నాలకుంట గ్రామ ప్రత్యేకాధికారిగా ఉన్న ఈవోపీఆర్డీని అనధికారికంగా తప్పించిన ఎంపీడీవో శ్రీదేవి.. పంచాయతీ ప్రత్యేకాధికారిగా తన పేరును మార్పించుకున్నారు. తదనంతరం పంచాయతీలో 14వ ఆర్థిక సం ఘం నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తగా, దీనిపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో విలేకరులు కార్యాలయంలోకి వస్తే లొసుగులు బయటకు వస్తాయనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారని సిబ్బందిలో చర్చ నడుస్తోంది. దీనిపై వివరణ కోసం ఎంపీడీవోకు ఫోన్ చేసినా తీయడం లేదు.
Updated Date - 2020-08-22T09:22:46+05:30 IST