ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమన్వయ లోపంతో సమస్యలు

ABN, First Publish Date - 2020-03-27T08:44:38+05:30

‘‘కరోనా నియంత్రణ చర్యల్లో మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం లేదు. సామాజిక దూరం పాటించాల్సిన సమయంలో ఇందిరాగాంధీ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కూలీలను, కార్మికులను ఆదుకోవాలి: దేవినేని


గొల్లపూడి, మార్చి 26: ‘‘కరోనా నియంత్రణ చర్యల్లో మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం లేదు. సామాజిక దూరం పాటించాల్సిన సమయంలో ఇందిరాగాంధీ స్టేడియంలో వేలాదిమంది ప్రజలు ఉండటం ఆందోళన కలిగించే అంశం. అనునిత్యం వేలాదిమందితో రద్దీగా ఉండే విజయవాడ, నెల్లూరు, తిరుపతి ఆసుపత్రులను కరోనా కేంద్రాలుగా ఏర్పాటు చేయడంలో తీసుకున్న జాగ్రత్తలపై ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి’’ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. గురువారం గొల్లపూడిలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అధికారులతో ప్రభుత్వ సమన్వయ లోపం వల్ల ఎన్‌ఓసీ తీసుకుని హైదరాబాద్‌ నుంచి వచ్చిన వేలాదిమంది గరికపాడు చెక్‌పోస్టు వద్ద పిల్లాపాపలతో తిండిలేక అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. రైతులకు చెల్లించాల్సిన ధాన్యం డబ్బును వెంటనే చెల్లించాలన్నారు. భవన నిర్మాణ కార్మికులను, ఉపాధి, వ్యవసాయ కూలీలకు రెండు నెలల రేషన్‌, రూ.5 వేలు నగదు అందించాలని విజ్ఞప్తి చేశారు.  హనుమాన్‌ జంక్షన్‌లో జర్నలిస్టులపై జరిగిన దాడి దురదృష్టకరమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 100 రోజులుగా రైతులు చేస్తున్న అమరావతి ఉద్యమానికి స్పందించి రాజధానిగా అమరావతినే కొనసాగిస్తూ సీఎం  ఓ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2020-03-27T08:44:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising