అసెంబ్లీని, రైతులను ప్రభుత్వం తప్పు దోవ పట్టించింది: నిమ్మల
ABN, First Publish Date - 2020-12-01T18:45:26+05:30
అమరావతి: ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు.
అమరావతి: ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. వాస్తవాలు.. ఆధారాలతో బయట పెడుతున్నందునే సస్పెండ్ చేశారన్నారు. నిన్న రాత్రి హడావిడిగా ఇన్స్యూరెన్స్ ప్రీమియం జీఓ ఇచ్చారన్నారు. రైతాంగం నష్టపోయాక ఇప్పుడు ప్రీమియం కడితే ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీని, రైతులను ప్రభుత్వం తప్పు దోవ పట్టించిందన్నారు. దీనిపై సభా హక్కుల నోటీస్ ఇస్తామని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
Updated Date - 2020-12-01T18:45:26+05:30 IST