ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులంతా విశాఖ వెళ్లడానికి సిద్ధం: చంద్రశేఖర్‌

ABN, First Publish Date - 2020-11-04T01:38:31+05:30

ఉద్యోగులంతా విశాఖ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ తెలిపారు. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా అవతరిస్తుందని చెప్పారు. హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చినప్పుడు ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇచ్చారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఉద్యోగులంతా విశాఖ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ తెలిపారు. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా అవతరిస్తుందని చెప్పారు. హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చినప్పుడు ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు విశాఖలో ఉంటున్న ఉద్యోగులకు.. విశాఖకు వచ్చే ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని కోరారు. కరోనా సమయంలో కట్‌ చేసిన జీతాలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ రద్దుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారని వెల్లడించారు. కరోనా తగ్గకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే అవసరమైతే కోర్టుకు వెళ్తామని చంద్రశేఖర్‌ హెచ్చరించారు.

Updated Date - 2020-11-04T01:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising