ఆయన్ను మేయర్‌ను చేయడానికి రంగంలోకి రాయపాటి..
ABN, First Publish Date - 2020-03-13T22:57:19+05:30
గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు యాక్టివ్ అయ్యారు...
గుంటూరు : గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు యాక్టివ్ అయ్యారు. నిన్న మొన్నటి వరకూ ఆయన టీడీపీకి టాటా చెప్పేసి.. వైసీపీ లేదా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాను ఏ పార్టీలోకి వెళ్లట్లేదని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానంటూ రంగంలోకి దిగారు. అప్పుడెప్పుడో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. శుక్రవారం నాడు టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు.
మేయర్ పీఠంపై కూర్చొబెడతా!
ఇవాళ గుంటూరు మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాయపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. గుంటూరు మేయర్ అభ్యర్థిగా కోవెలమూడిని గెలిపించేందుకు గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు. ఆయనకోసం నగరం మొత్తం తిరుగుతానని.. అంతేకాదు టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడతానన్నారు. కోవెలమూడి రవీంద్రను మేయర్ పీఠంపై కూర్చోబెడతానని రాయపాటి ధీమాతో చెప్పారు. మొత్తానికి చూస్తే రాయపాటి తాజా వ్యాఖ్యలతో ఆయనకు పార్టీ మారే ఆలోచనలేదని.. టీడీపీలో కొనసాగుతానని తేల్చి చెప్పినట్లయ్యింది.
ఎవరీ రవీంద్ర..!?
తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కోవెలమూడి రవీంద్ర(నాని) గత డిసెంబర్‌లో నియమితుడయ్యారు. పశ్చిమ ఎమ్మెల్యే గిరి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న దృష్ట్యా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నాయకులతో చర్చించి పశ్చిమ ఇన్‌చార్జ్‌గా ఆయన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతోన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా అండగా నిలిచి తన సహకారాలు అందించారు.
Updated Date - 2020-03-13T22:57:19+05:30 IST