ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త కేసులు 9024

ABN, First Publish Date - 2020-08-12T08:55:17+05:30

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 9,024 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌లు 2,44,549కి చేరాయి. తాజాగా 9,113మంది కోలుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మరో 87మంది మృతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 9,024 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌లు 2,44,549కి చేరాయి. తాజాగా 9,113మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ 1,54,749మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మరో 87,597 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం అనంతపురంలో 13మంది, చిత్తూరు 12 మంది, గుంటూరు 9మంది, ప్రకాశం, విశాఖల్లో ఏడుగురు చొప్పున, కడప, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున, తూర్పుగోదావరి, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కృష్ణా, కర్నూలు జిల్లా ల్లో ముగ్గురు చొప్పున మొత్తం 87మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 2,203కు పెరిగాయి. ఇది ప్రభుత్వం ప్రకటించిన మృతుల సంఖ్య మాత్రమే. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణుల అంచనా. తూర్పుగోదావరిలో 24గంటల్లో 1,372 కేసులు నమోదయ్యాయి.


పెద్దాపురం తహశీల్దార్‌కు కొవిడ్‌ నిర్ధారణ అయింది. కర్నూలు జిల్లాలో మరో 1,138మంది వైరస్‌ బారిన పడ్డారు. మరణాల సంఖ్య 254కి చేరింది. విశాఖలో మరో 676 మంది వైరస్‌ బారిన పడ్డారు. కడపలో మరో 579మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. చిత్తూరులో మరో 818 మందికి వైరస్‌ సోకినట్టు గుర్తించారు. మంగళవారం తిరుపతిలో సకాలంలో వైద్యం అందక కొవిడ్‌ బాధితుడొకరు మృతిచెందారు. నెల్లూరులో మరో 364మందికి కొవిడ్‌ సోకింది. అనంతపురంలో 959, గుంటూరులో 717 చొప్పున కొత్త కేసులు వెలుగులోకి వచ్చా యి. విజయనగరంలో 594, శ్రీకాకుళంలో 504, కృష్ణాజిల్లాలో 342 మందికి తాజాగా కరోనా నిర్ధారణ అయింది. కాగా, గోదావరి జిల్లాలను కలిపే రోడ్డుకమ్‌ రైలు వంతెనపై రాకపోకలు ప్రారంభమయ్యాయి.  

Updated Date - 2020-08-12T08:55:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising