వైఎస్‌ఆర్ చేయూత ద్వారా రూ. 5.45 కోట్ల రుణాలు
ABN, First Publish Date - 2020-12-05T05:33:15+05:30
పశుసంవర్ధక శాఖ ద్వారా వైఎస్‌ఆర్ చేయూత పథకం ద్వారా రూ.5కోట్ల 45లక్షల రుణాలను మంజూరు చేస్తున్నామని ఆ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ సోమయ్య తెలిపారు.
ఏడీ సోమయ్య
ముత్తుకూరు, డిసెంబరు 4: పశుసంవర్ధక శాఖ ద్వారా వైఎస్‌ఆర్ చేయూత పథకం ద్వారా రూ.5కోట్ల 45లక్షల రుణాలను మంజూరు చేస్తున్నామని ఆ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ సోమయ్య తెలిపారు. ముత్తుకూరు వెలుగు కార్యాలయంలో శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ, బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా పొదుపు మహిళలకు పాడి పశువులు, గొర్రెలు, మేకలను అందజేయనున్నామన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. ఈ నెల 7వ తేదీ లోగా రైతు భరోసా కేంద్రాల ద్వారా దరఖాస్తులు అందజేయాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 10న రుణాల గ్రౌండింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రత్యూష, వెలుగు ఏసీ శ్రీనివాస్, ఏపీఎం విజయలక్ష్మి, బ్యాంకు మేనేజర్లు దీక్షితులు, మల్లికార్జున, పశువైద్యాధికారులు మహేశ్వరయ్య, భానుప్రకాష్, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-05T05:33:15+05:30 IST