ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సోమశిల’కు జలకళ

ABN, First Publish Date - 2020-09-01T06:37:27+05:30

కృష్ణాజలాల రాకతో సోమశిల జలాశయానికి జలకళ సంతరించుకొంది. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు. సోమవారం నాటికి నీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కొనసాగుతున్న  క ృష్ణాజలాల ప్రవాహం

45 టీఎంసీల చేరువలో నీటి మట్టం

 జిల్లా రైతుల్లో హర్షం


అనంతసాగరం, ఆగస్టు 31 : కృష్ణాజలాల రాకతో సోమశిల జలాశయానికి జలకళ సంతరించుకొంది. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు. సోమవారం నాటికి నీటి మట్టం 311.88 అడుగుల మేర  43.958 టీఎంసీలుగా నమోదైంది. మంగళవారం నాటికి 45 టీఎంసీలు దాటే అవకాశం ఉంది. రోజూ 20వేల నుంచి 23వేల క్యూసెక్కుల ప్రవాహం సోమశిలకు చేరుతోంది.


  శ్రీశైలం జలాశయం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి ఈనెల 19న దిగువకు నీటి విడుదల చేశారు. అప్పటికి జలాశయంలో 29 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇప్పటి వరకు సుమారు 15 టీఎంసీల నీరు అదనంగా చేరింది. వస్తున్న ప్రవాహంలో 8000 క్యూసెక్కులను కండలేరు జలాశయానికి విడుదల చేసి మిగిలిన నీటిని నిల్వ చేస్తున్నారు. సోమశిల, కండలేరు జలాశయాలు పూర్తిగా నిండే అవకాశాలు  ఉండడంతో జిల్లా రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.


 ఈసారీ గేట్లు ఎత్తే సూచనలు

సహజంగా సోమశిల జలాశయానికి సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో కురిసే వర్షాలతో వరద వస్తుంది. ఈసారి ముందే నీరు చేరుతోంది. గతేడాది వరదతో సోమశిలలో 78 టీఎంసీలు నిల్వ చేశారు. అదనపు జలాలు రావడంతో 12 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేశారు.


వచ్చే మూడు నెలల్లో వరద వచ్చే సూచనలు కనిపిస్తుండడంతో ఈసారి డ్యాం గే ట్లు ఎత్తే అవకాశం  ఉంటుందని అదికారులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా క్రస్ట్‌గేట్ల పటిష్టతపై యంత్రాంగం దృష్టి సారించింది. వరద భారీగా  వస్తే అందుకనుగుణంగా గేట్లు పనిచేసేలా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.


Updated Date - 2020-09-01T06:37:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising