ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రీ రిపబ్లిక్‌ డే క్యాంపునకు వెళ్లడం సంతోషకరం

ABN, First Publish Date - 2020-12-03T05:10:26+05:30

విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ) నుంచి ముగ్గురు ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు వెస్ట్‌జోన్‌ ప్రీ రిపబ్లిక్‌ డే క్యాంపునకు వెళ్లడం చాలా సంతోషకరమైన విషయమని వీఎస్‌యూ వైస్‌ చాన్సలర్‌ రొక్కం సుదర్శనరావు పేర్కొన్నారు.

వెస్ట్‌జోన్‌ ప్రీ రిపబ్లిక్‌ డే క్యాంపులో పాల్గొన్న వలంటీర్లతో వైఎస్‌ చాన్సలర్‌ సుదర్శనరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీఎస్‌యూ వైస్‌ చాన్సలర్‌ సుదర్శనరావు


వెంకటాచలం, డిసెంబరు 2 : విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ) నుంచి ముగ్గురు ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు వెస్ట్‌జోన్‌ ప్రీ రిపబ్లిక్‌ డే క్యాంపునకు వెళ్లడం చాలా సంతోషకరమైన విషయమని   వీఎస్‌యూ వైస్‌ చాన్సలర్‌ రొక్కం సుదర్శనరావు పేర్కొన్నారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్‌యూలో బుధవారం ప్రీ రిపబ్లిక్‌ డే క్యాంపులో పాల్గొన్న ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారికి సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెస్ట్‌జోన్‌ క్యాంపునకు ఆరు రాష్ర్టాల నుంచి 200 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు పాల్గొన్నారని, 10 రోజులు జరిగిన ఈ క్యాంపులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 40 మందిని ఎంపిక చేస్తారని తెలిపారు. మన జిల్లా నుంచి ఇద్దరు వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ జరిగే రిపబ్లిక్‌ డే క్యాంపునకు ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో వీఎస్‌యూ రెక్టార్‌ ఎం. చంద్రయ్య, రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ ఆర్‌ ప్రభాకర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డాక్టర్‌ అల్లం ఉదయ్‌ శంకర్‌, డీకేడబ్ల్యూ కళాశాల ప్రోగ్రాం అధికారిణి డాక్టర్‌ దివిజా దేవి తదితరులున్నారు. 

Updated Date - 2020-12-03T05:10:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising