జిల్లా ఓటర్లు 24.35 లక్షల మంది
ABN, First Publish Date - 2020-11-14T03:08:27+05:30
జిల్లాలో 24,35,035 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
పురుషుల కంటే మహిళలే ఎక్కువ
ముసాయిదా జాబితా ప్రకటించిన కలెక్టర్
నెల్లూరు (హరనాథపురం), నవంబరు 13 : జిల్లాలో 24,35,035 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో పురుషులు 11,92,916 మంది, మహిళలు 12,42,119 మంది ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్యలో 49,203 మంది మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఈ నెల 16న ప్రచురించనున్న జిల్లావ్యాప్త ముసాయిదా ఓటర్ల జాబితా వివరాలను కలెక్టర్ చక్రధర్‌బాబు ప్రకటించారు. ఈ నెల 16 నుంచి డిసెంబరు 15వ తేదీ వరకు ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఓటరు నమోదుకు ఈ నెల 28, 29 తేదీలను, డిసెంబరు 12, 13 తేదీలను ప్రత్యేక ప్రచార రోజులుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2021, జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన లేదా నిండుతున్నట్లయితే వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. జనవరి 15న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని తెలిపారు.
నియోజకవర్గాల వారీగా...
నియోజవర్గం పోలింగ్ కేంద్రాలు పురషులు స్త్రీలు మొత్తం
కావలి 314 127053 132998 260051
ఆత్మకూరు 278 105517 107230 212747
కోవూరు 323 128143 138143 266286
నెల్లూరుసిటీ 248 117646 123169 240815
నెల్లూరు రూరల్ 266 128022 134758 262780
సర్వేపల్లి 282 114188 119327 233515
గూడూరు 289 118770 124682 243452
సూళ్లూరుపేట 296 116290 120872 237162
వెంకటగిరి 296 119756 123363 243119
ఉదయగిరి 323 117531 117577 235108
మొత్తం 2915 1192916 1242119 2435035
Updated Date - 2020-11-14T03:08:27+05:30 IST