ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ ది ఐరన్‌ లెగ్‌

ABN, First Publish Date - 2020-11-30T04:43:33+05:30

రాష్ట్ర చరిత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ఐరన్‌ లెగ్‌ ముఖ్యమంత్రిగా నిలిచిపోతాడని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, తిరుపాతి పార్లమెంటు టీడీపీ ఇన్‌చార్జి నరసింహులు యాదవ్‌ విమర్శించారు.

విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న కురుగొండ్ల, నరసింహులు యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆయన  సీఎం అయ్యాకే ప్రజలకు కష్టాలు

వరద సహాయక చర్యలు ఎక్కడ ?

హెలికాప్టర్‌లో తిరిగితే ప్రజల కష్టాలు కనిపించవు

మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల, నరసింహులు యాదవ్‌ ధ్వజం

వెంకటగిరి, నవంబరు 29 :  రాష్ట్ర చరిత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ఐరన్‌ లెగ్‌ ముఖ్యమంత్రిగా నిలిచిపోతాడని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, తిరుపాతి పార్లమెంటు టీడీపీ ఇన్‌చార్జి నరసింహులు యాదవ్‌ విమర్శించారు. ఆదివారం నియోజకవర్గంలో తుఫానుతో దెబ్బతిన్న మగ్గాలు, వరిపైర్లను పరిశీలించారు. అనంతరం స్థానిక తెలుగుగంగ అతిఽథిగృహంలో విలేఖర్లతో మాట్లాడుతూ తుఫానుతో  ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. చేనేతలకు ఎన్నడూలేనంతగా నష్టం వాటిల్లిందన్నారు. తుఫాను బాధితులకు సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. విశాఖలో హుద్‌హుద్‌ తుఫాను సంభవించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించిన తీరునుగుర్తుచేశారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో కరోనాతో కొంతమంది చనిపోగా, తుపానుల కారణంగా ఎంతో మంది నష్టపోయారన్నారు. దీంతో ఆయన ఐరన్‌లెగ్‌ ముఖ్య మంత్రిగా చరిత్రలో నిలిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు ఉష, నియోజకవర్గ పరిశీలకుడు జన్ని రమణయ్య, నాయకులు రవి నాయుడు, బీరం రాజేశ్వరరావు, కేవీకే ప్రసాద్‌, శ్రీరాం దాసు గంగాధర్‌, పునుగోటి విశ్వనాఽథం నాయుడు, ఆనంద్‌, చలపతి, సుధాకర్‌, నరసింహులు, ఆవుల ప్రహ్లాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-30T04:43:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising