ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు ఏకగ్రీవం.. ఒక్కదానికే పోటీ!

ABN, First Publish Date - 2020-09-24T17:29:17+05:30

ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ లో ఎన్నికలకు సంబంధించి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయ డెయిరీలో మొదలైన ఎన్నికల పర్వం

మూడు పదవులకు నాలుగు నామినేషన్లు

ప్రస్తుత చైర్మన్‌కే పోటీ...

ఉపసంహరణకు నేటి సాయంత్రం వరకు గడువు 


నెల్లూరు: ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ లో ఎన్నికలకు సంబంధించి బుధవారం నామి నేషన్ల స్వీకరణ జరిగింది. ప్రస్తుత చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డితోపాటు ఇద్దరు మహిళా డైరెక్టర్ల పదవీ కాలం పూర్తి కావడంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే మహిళా అభ్యర్థులుగా కోవూరు మండలం మోడేగుంట పాల సొసైటీ సభ్యురాలు కన్నా ఇందిరమ్మ, బాలాయపల్లి మండలం వెంగమాంబపురం పాల సొసైటీ సభ్యురాలు సూదలగుంట సాయి నిరోషా మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు.


దీంతో వారి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లే. వారిద్దరూ ప్రస్తుత చైర్మన్‌ వర్గీయులే కావడం గమనార్హం. ఇక చైర్మన్‌ రంగారెడ్డికి పోటీగా ముత్తుకూరు మండలం నారికేళపల్లి పాల సొసైటీ సభ్యుడు కోట చంద్రశేఖర్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం సాయంత్రం వరకు గడువు ఉంది. వారిద్దరూ నామినేషన్‌ ఉపసంహరించుకోకపోతే ఈ నెల 26న పోలింగ్‌ జరుగుతుంది.

Updated Date - 2020-09-24T17:29:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising