ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోయిన సొమ్ము అప్పగించిన చిరు వ్యాపారి

ABN, First Publish Date - 2020-07-10T11:08:09+05:30

పట్టణంలోని కోపరేటివ్‌ కాలనీకి చెందిన కే.జ్యోతి పోగొట్టుకున్న బంగారం, నగదును గురువారం ఒకటో పట్టణ సీఐ శ్రీనివాసరావు సమక్షంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 10 సవర్ల బంగారం, రూ.3500నగదు అప్పగింత

వ్యాపారిని అభినందించిన సీఐ శ్రీనివాసరావు 


కావలి రూరల్‌, జూలై9: పట్టణంలోని కోపరేటివ్‌ కాలనీకి చెందిన కే.జ్యోతి పోగొట్టుకున్న బంగారం, నగదును గురువారం ఒకటో పట్టణ సీఐ శ్రీనివాసరావు సమక్షంలో చిరు వ్యాపారి అయిన పిల్లి వెంకటేశ్వర్లు బాధితులకు అప్పగించారు. వివరాల మేరకు కోపరేటివ్‌ కాలనీకి చెందిన జ్యోతి తన పిల్లలతో  కలిసి బుచ్చిరెడ్డిపాళెం మండలం రామచంద్రాపురం నుంచి ఆటో లో బుధవారం సాయంత్రం కావలి వచ్చారు.


పట్టణంలోని ఏఎం బేకరీ సమీపంలో పిల్లలకు షోడా తాగించి ఆటోలో ఇంటికి వెళ్లే సమయంలో నగలు పోగొట్టుకున్నారు. స్టీలు సామాన్లు వాయిదాల పద్ధతిలో విక్రయించే గాయత్రీనగర్‌కు చెందిన పిల్లి వెంకటేశ్వర్లుకు ఫైర్‌ ఆఫీసుకు సమీపంలో నగలు ఉన్న పర్సు దొరికింది. వెంటనే వెంకటేశ్వర్లు పోలీసులను ఆశ్రయించి  వారి సహాయంతో బాధితులకు ఆ పర్సును అందజేశారు. సుమారు రూ. 4 లక్షల విలువ చేసే నగదు దొరికినప్పటికీ నిజాయితీగా అప్పగించిన వెంకటేశ్వర్లును సీఐ అభినందించారు.

Updated Date - 2020-07-10T11:08:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising