ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో కలెక్టర్‌కు స్థానచలనం

ABN, First Publish Date - 2020-07-03T10:08:33+05:30

జిల్లా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు త్వరలోనే బదిలీ జరిగే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో ఇమడలేక ప్రభుత్వానికి విజ్ఞప్తి

రెండువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్‌ల బదిలీలు

రేసులో ఇద్దరు ఐఏఎస్‌ల పోటీ!


నెల్లూరు, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు త్వరలోనే బదిలీ జరిగే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 8న పేదలందరికీ ఇళ్లు పథకం ముగిసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పలువురు కలెక్టర్ల బదిలీకి కసరత్తు జరగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శేషగిరిబాబు కూడా బదిలీ కానున్నట్లు సమాచారం. అయితే ఆయనే స్వయంగా బదిలీ కోరుకున్నట్లు అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధానంగా జిల్లాలోని రాజకీయ పరిస్థితులే కారణమన్న ప్రచారం జరుగుతోంది.


కలెక్టర్‌గా గతేడాది జూన్‌లో శేషగిరిబాబు బాధ్యతలు చేపట్టారు. మొదటి నుంచి అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న ఆయన జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడం, ఏకంగా తనపై పలువురు ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలకు దిగడంతో కలెక్టర్‌ కలత చెందారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆయనకు కత్తిమీద సాములా మారింది. అయినా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. సచివాలయ వ్యవస్థ ప్రారంభంలోను, కరోనాను ఎదుర్కొనే విషయంలోను సమర్థవంతంగా పని చేశారు. కొంతకాలం నుంచి ఆయన బదిలీ కోరుకుంటున్నారని, కానీ కరోనా విపత్కర సమయంలో అది సాధ్యం కాలేదన్న ప్రచారం జరుగుతోంది.


ఉత్తరాంధ్రలోని ఓ జిల్లాకు ఆయన కలెక్టర్‌గా వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లా రేసులో ఇద్దరు ఐఏఎస్‌లు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఒకరు గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన జేసీ కాగా మరొకరు ఇక్కడకు గతంలో జేసీగా రావాలని ప్రయత్నం చేసిన అధికారి అని ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2020-07-03T10:08:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising