3 నుంచి యథావిధిగా ప్రత్యేక రైళ్లు
ABN, First Publish Date - 2020-12-01T16:45:55+05:30
తుఫాన్ దృష్ట్యా రద్దు అయిన రైళ్లను యథావిధిగా..
సింహపురి ఎక్స్‌ప్రెస్ కూడా పరుగు
నెల్లూరు: తుఫాన్ దృష్ట్యా రద్దు అయిన రైళ్లను యథావిధిగా నడేపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. డిసెంబరు 3వ తేదీ నుంచి ఈ రైళ్లు నడుస్తాయని విజయవాడ డివిజన్ పీఆర్‌వో మండ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సికింద్రాబాద్ - గూడురు - సికింద్రాబాద్ సింహపురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 3న సికింద్రాబాద్‌లో, 4న గూడూరు నుంచి బయలుదేరుతుందని తెలిపారు. దీంతోపాటు నెల్లూరు మీదుగా తిరుచాపల్లి - హౌరా - తిరుచానపల్లి, చైన్నె - చాప్రా - చైన్నె, ఎర్నాకుళం - బరోనీ - ఎర్నాకుళం, ఘయా - చైన్నె - ఘయా, యశ్వం త్‌పూర్ - పాటలీపుత్ర - యశ్వంత్‌పూర్, ధానాపూర్ - యశ్వంత్‌పూర్ -ధానాపూర్ రైళ్లను పునరుద్ధరించినట్లు తెలిపారు. ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.
Updated Date - 2020-12-01T16:45:55+05:30 IST