జీవో 77ను రద్దు చేయాలి
ABN, First Publish Date - 2020-12-29T05:40:39+05:30
ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న పీజీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల విద్యార్థులకు జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు వర్తించబోవంటూ విడుదల చేసిన జీవో నెం.77ను తక్షణం రద్దు చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
టీఎన్‌ఎస్‌ఎఫ్ నిరసన
నెల్లూరు(వ్యవసాయం), డిసెంబరు 28 : ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న పీజీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల విద్యార్థులకు జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు వర్తించబోవంటూ విడుదల చేసిన జీవో నెం.77ను తక్షణం రద్దు చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఆ జీవో వల్ల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని టీఎన్‌ఎస్‌ఎఫ్ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు వీ ప్రణయ్‌కుమార్‌రెడ్డి, నగర అధ్యక్షుడు పీ ఆషిక్ అలీఖాన్ పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు అందరికీ వసతి, విద్యాదీవెన పథకాలను వర్తింపు చేయాలని కోరుతూ సోమవారం వీఆర్సీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జీవో నెం.77 ప్రతులను దహనం చేశారు. వారు మాట్లాడుతూ ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జీవో నెం.77ను రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్, రాకేష్, సుకాంత్, సంజయ్, నాసిర్, వంశి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-29T05:40:39+05:30 IST