ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొమ్ము ప్రభుత్వానిది.. సోకు వైసీపీ నాయకులదా..?

ABN, First Publish Date - 2020-04-09T11:32:44+05:30

సొమ్ము ఒకరిది.. సోకు మరోకరిది అన్నట్లుగా ఉంది వైసీపీ నాయకుల తీరు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట, ఏప్రిల్‌ 8 : సొమ్ము ఒకరిది.. సోకు మరోకరిది అన్నట్లుగా ఉంది వైసీపీ నాయకుల తీరు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు రూ.1000ల చొప్పున ఆర్థికసాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు పంపితే.. వైసీపీ నాయకులు తమ సొంత సొమ్ము ఇస్తున్నట్లు ఆ పైకాన్ని పంపిణీ చేస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. సూళ్లూరుపేట మండలం ఇలుపూరు గ్రామ గిరిజనవాడలో  ఈ ప్రాంత వైసీపీ నేతలు డబ్బు పంపిణీ చేశారు.


సూళ్లూరుపేట ఎంపీపీ అభ్యర్థిగా ఇటీవల మండల పరిషత్‌ ఎన్నికలకు ఎంపీటీసీగా నామినేషన్‌ వేసిన అల్లూరు అనిల్‌రెడ్డి, ఇలుపూరు ఎంపీటీసీ అభ్యర్థి మంగానెల్లూరు సుధాకర్‌లతోపాటు చిలకా యుగంధర్‌, రఘులు పంపిణీ చేస్తుంటే.. సాక్ష్యాత్తు ఎంపీడీవో నర్మద, పంచాయతీ కార్యదర్శి మహేశ్వరిలు ఎలా నిలబడి ఉన్నారో చూడండి. ఈ నాయకులకు ఏ అధికారం ఉందని ఈ అధికారులు వీళ్లద్వారా ప్రభుత్వ సొమ్ము పంపిణీ చేయించారో వారికే తెలవాలి

Updated Date - 2020-04-09T11:32:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising