ప్రభగిరిపట్నం మైనింగ్‌పై సమగ్ర విచారణ జరగాలి
ABN, First Publish Date - 2020-11-14T04:06:15+05:30
ప్రభుత్వానికి రాయల్టీ కూడా చెల్లించకుండా రాత్రికి రాత్రే విలువైన ఖనిజాన్ని తరలిస్తున్నారని, రోజుకు 30లారీల ఖనిజం తరలిపోతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు.
రోజుకు 30లారీల ఖనిజం తరలిపోతోంది
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం
నెల్లూరు(వ్యవసాయం), నవంబరు 13 : ప్రభగిరిపట్నం మైనింగ్ టర్నోవర్‌లో నీవాటా ఎంత?, కొండను కాపాడుతానన్న నీవు ఆ కొండనే ఎత్తుకెళ్లిపోయావ్... అక్కడి మైనింగ్‌పై నీ చాలెంజ్‌కు నేనెప్పుడైనా రెడీ.. నువ్వు సిద్ధమా అంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డిని ప్రశ్నించారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కనీసం ప్రభుత్వానికి రాయల్టీ కూడా చెల్లించకుండా రాత్రికి రాత్రే విలువైన ఖనిజాన్ని తరలిస్తున్నారని, రోజుకు 30లారీల ఖనిజం తరలిపోతోందని ఆరోపించారు. దాదాపు రూ.70లక్షల నుంచి రూ.కోటికిపైగా టర్నోవర్ నడుస్తోందన్నారు. ప్రభగిరిపట్నం కొండలపై గుప్తనిధులున్నాయని కాకాణి గతంలో చెప్పారని, ఇప్పుడా నిధులు ఏమయ్యాయి?, దేవతా విగ్రహాలు లండన్‌లో అమ్మేశారంట కదా? అని ప్రశ్నిం చారు. ఈ మైనింగ్‌పై సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ను కోరుతామన్నారు. ప్రజలం తా చైతన్యవంతులై పోరాడితేనే దేవుడి కొండలు మనకు దక్కుతాయని పిలుపునిచ్చారు.
Updated Date - 2020-11-14T04:06:15+05:30 IST