ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తక్షణం రూ.10వేలివ్వాలి

ABN, First Publish Date - 2020-11-30T05:44:16+05:30

వరదల కారణంగా నష్టపోయిని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.10వేల నష్టపరిహారం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ డిమాండ్‌ చేశారు.

వరద బాధితులను పరామర్శిస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ నేత అజీజ్‌


నెల్లూరు(వ్యవసాయం), నవంబరు 29 : వరదల కారణంగా నష్టపోయిని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.10వేల నష్టపరిహారం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ శ్రీనివాసులు, బద్వేల్‌ నియోజకవర్గ టీడీపీ నేత ఓబులాపురం రాజశేఖర్‌, పార్టీ నెల్లూరు నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో కలిసి ఆయన నెల్లూరులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం పర్యటించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఇంటికి వెళ్లేప్పుడు రూ.200 ఇచ్చి పంపమని మంత్రి అనిల్‌ చెప్పారని, వరదలతో రూ.లక్షలు పోగొట్టుకున్న వాళ్లకి రూ.200 ఇస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ శ్రీనివాసులు మాట్లాడుతూ తన జీవితంలో  ఎప్పుడూ చూడని బాధాకరమైన దృశ్యాలు చూశానన్నారు. ఇక్కడి పరిస్థితులు తెలుసుకుని సాయంత్రంలోపు తెలియజేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించార న్నారు. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ అనిల్‌ ఒక చేతకాని మంత్రని, వరద వచ్చి ప్రజలు అవస్థ పడుతుంటే ఆయనకు చీమకుట్టినట్లుకూడా లేదని విమర్శించారు.  బాధితులకు తక్షణ సహాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ధర్మవర పు సుబ్బారావు, సాబీర్‌ఖాన్‌, ఖాజావలి, జలదంకి సుధాకర్‌, జహీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-30T05:44:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising