ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు సస్పెన్షన్‌ శాసనసభ వ్యవస్థకే కళంకం

ABN, First Publish Date - 2020-12-02T04:38:24+05:30

శాసనసభలో ప్రజా సమస్యలపై గళమెత్తిన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును సభ నుంచి స్పీకర్‌ సస్పెండ్‌ చేసి శాసనసభ వ్యవస్థకే కళంకం తెచ్చారని మాజీ ఎంపీ, టీడీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎంపీ నెలవల 

పెళ్లకూరు, డిసెంబరు 1 : శాసనసభలో ప్రజా సమస్యలపై గళమెత్తిన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడును సభ నుంచి  స్పీకర్‌ సస్పెండ్‌ చేసి శాసనసభ వ్యవస్థకే కళంకం తెచ్చారని మాజీ ఎంపీ, టీడీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. నాయుడుపేటలోని తన స్వగృహంలో ఆయన మంగళవారం  విలేకర్లతో మాట్లాడారు. గతంలో ఉత్తరాంధ్రలో వచ్చిన, ప్రస్తుతం నివర్‌ తుఫాన్ల కారణంగా ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారనీ, రైతులు పంటలను నష్టపోయారనీ తెలిపారు.    దాంతో కలత చెందిన చంద్రబాబు ఆ అంశాలను అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఓ మంత్రి చంద్రబాబును అసభ్యకరంగా సంబోధించడం సిగ్గుచేటన్నారు. అలా మాట్లాడడానికి ఆ మంత్రి వీధి రౌడీనా అని  ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వానికి, వైసీపీ నాయకులకు తగిన సమయంలో ప్రజలే  బుద్ధిచెబుతారన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి పేరం మధునాయుడు, మండల  అధ్యక్షుడు వేలూరు మురళీకృష్ణారెడ్డి, మల్లు కృష్ణయ్య, వెంపర్ల వెంకటేశ్వర్లు, నెలవల ప్రసాద్‌, జి. రామకృష్ణ, ఓజిలి మండల నాయకులు విజయకుమార్‌నాయుడు, వల్లూరు సూర్యప్రకాష్‌రావు, ఖలీల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T04:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising