ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంపు ప్రాంతాల్లో ఎస్పీ పరిశీలన

ABN, First Publish Date - 2020-11-28T04:47:14+05:30

నివార్‌ తుపాను ప్రభావంతో నెల్లూరు నగరంలో నీట మునిగిన ముంపు ప్రాంతాలను జిల్లా ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ శుక్రవారం పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(క్రైం), నవంబరు 27: నివార్‌ తుపాను ప్రభావంతో నెల్లూరు నగరంలో నీట మునిగిన ముంపు ప్రాంతాలను జిల్లా ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ శుక్రవారం పరిశీలించారు. అహ్మద్‌నగర్‌, బోడిగాడితోట, జనార్దన్‌రెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రజలను పునారావస కేంద్రాలకు తరలిచాలని సిబ్బందిని ఆదేశించారు. సోమశిల జలాశయం నుంచి 5 లక్షల క్యూసెక్యులు విడుదల చేస్తున్నందున 10 అడుగుల పైకి నీరు వస్తుందని, ఏ ప్రాంతంలో ఎలాంటి ప్రాణ నష్టం, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. రోప్స్‌, లైట్స్‌ తదితర అవసరమైన సామగ్రి సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రజలు పోలీసు సహాయక చర్యల కోసం డయల్‌ 100, 9390777727 నెంబరుకు సమాచారం అందించాలన్నారు. మరో 48 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట నగర డీఎస్పీ జే శ్రీనివాసులరెడ్డి, సంతపేట, చిన్నబజారు, బాలాజీనగర్‌ సీఐలు అన్వర్‌బాషా, మధుబాబు, మంగారావు, పీఆర్‌వో శ్రీకాంత్‌, తదితరలులు ఉన్నారు. 

Updated Date - 2020-11-28T04:47:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising