ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమార్కులపై ఉక్కు పాదం

ABN, First Publish Date - 2020-11-25T04:54:07+05:30

ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడిచే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్‌ఈబీ (జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) ఏఎస్పీ కే.శ్రీలక్ష్మి పేర్కొన్నారు.

బాధ్యతలు స్వీకరిస్తున్న ఏఎస్పీ శ్రీలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్‌ఈబీ ఏఎస్పీ శ్రీలక్ష్మి

నెల్లూరు(క్రైం), నవంబరు 24: ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడిచే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్‌ఈబీ (జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) ఏఎస్పీ కే.శ్రీలక్ష్మి పేర్కొన్నారు. పదోన్నతుల్లో జిల్లాకు నియమితులైన ఆమె పోలీసు కార్యాలయంలో మంగళవారం  బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ను, ఏఎస్పీ పీ.వెంకటరత్నంను మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మద్యం అక్రమ రవాణా, తయారీ, అనధికార విక్రయాలు, ఇసుక అక్రమ రవాణా, గంజాయి, గుట్కా విక్రయాలను నిరోధించడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. అక్రమాలకు పాల్పడుతూ పలుమార్లు పట్టుపడితే వారిపై రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరించారు. సరిహద్దుల్లో నిఘా పెంచి అక్రమ రవాణాను అడ్డుకుంటామన్నారు. దీనికి ప్రజల సహకారం అవసరమని, తమ ప్రాంతాల్లో ఇసుక, మద్యం అక్రమ నిల్వలు, అనధికార విక్రయాలు, గుట్కా, గంజాయి విక్రయాలు జరిగుతుంటే 8897122516 నెంబరుకు సమాచారం అందించాలని కోరారు. లేదా ఎఎస్‌పి.ఎస్‌ఈబి.నెల్లూరు జి మెయిల్‌కు సమాచారం అందిచవచ్చన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. 

శ్రీలక్ష్మి గ్రూప్‌-1 అధికారిణి

చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీలక్ష్మి ఎస్వీ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ సైకాలజీ పూర్తి చేసి గ్రూప్‌-2లో ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్‌లో పే అండ్‌ అకౌంట్స్‌ శాఖలో ఆడిటర్‌గా విధులు నిర్వహిస్తూ 2012లో గ్రూప్‌-1 రాసి డీఎస్పీగా పోలీసుశాఖలో చేరారు. రాష్ట్ర విభజన సమయంలో ఆమె ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడ్డారు. కదిరి డీఎస్పీగా, విజయవాడ మహిళా పోలీసుస్టేషన్‌ డీఎస్పీగా, గుంటూరు జిల్లా తెనాలి డీఎస్పీగా పనిచేసి ఈ ఏడాది ఏఎస్పీగా పదోన్నతి పొంది బదిల్లీలో నెల్లూరు జిల్లా ఎస్‌ఈబీ ఏఎస్పీగా నియమితులయ్యారు. 

Updated Date - 2020-11-25T04:54:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising