ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కదిలే బడి!

ABN, First Publish Date - 2020-08-04T11:05:51+05:30

కొవిడ్‌ కారణంగా పాఠశాలలు మూతపడటంతో విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారన్న కారణంగా ప్రభుత్వం సంచార ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంచార వాహనాల్లో విద్యాభోధన

 ‘విద్యా వారథి’ ప్రారంభం


నెల్లూరు(విద్య), ఆగస్టు 3 : కొవిడ్‌ కారణంగా పాఠశాలలు మూతపడటంతో విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారన్న కారణంగా ప్రభుత్వం సంచార వాహనాల్లో విద్యా బోధనకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే విద్యార్థులకు సప్తగిరి చానెల్‌, రేడియో, యూట్యూబ్‌ ద్వారా పాఠాలు బోధిస్తోంది. అయితే సాంకేతిక సదుపాయాలు లేని ప్రాంతాల విద్యార్థుల కోసం సంచార వాహనాల్లో విద్యాబోధన కార్యక్రమాన్ని చేపట్టింది.


దీనిలో భాగంగా సోమవారం నెల్లూరులోని దర్గామిట్ట జడ్పీ ఉన్నత పాఠశాలలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు సంచార వాహనాన్ని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌, ఇన్‌చార్జి డీఈవో ఉష, ఎస్‌ఎస్‌ఏ ఏసీపీ డాక్టర్‌ బ్రహ్మానందరెడ్డి, ఏఎంవో నాగమోహన్‌రెడ్డి, ఏఏఎంవో ఖాజాహుసేన్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-04T11:05:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising