ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

ABN, First Publish Date - 2020-08-08T10:04:23+05:30

ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఉద్యోగుల నిరసన


నెల్లూరు (వైద్యం), ఆగస్టు 7: ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం నెల్లూరులోని జనార్దన్‌రెడ్డి కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలల్లోకి తీసుకెళ్లటానికి స్కీం వర్కర్లు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వర్తింప చేయాలని కోరారు. కరోనా నేపథ్యంలో వారికి బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌,  శ్రామిక మహిళా విభాగం నగర కన్వీనర్‌ షేక్‌ మస్తాన్‌బీ, పద్మ, శ్రీదేవి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-08T10:04:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising