ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.180 కోట్లతో రోడ్లు, డ్రైన్ల నిర్మాణం : ఎమ్మెల్యే కాకాణి

ABN, First Publish Date - 2020-08-10T10:49:49+05:30

నియోజకవర్గంలో రూ.180 కోట్లతో డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొదలకూరురూరల్‌, ఆగస్టు 9 : నియోజకవర్గంలో రూ.180 కోట్లతో డ్రైన్లు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని దుగ్గుంట, రామాపురం గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఆ గ్రామాల్లో రూ.1.38కోట్లతో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. ఈ  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఆగిపోయిన అభివృద్ధి పనులను తిరిగి పూర్తి  చేస్తున్నామని తెలిపారు.  కార్యక్రమంలో ఎంపీడీవో నారాయణరెడ్డి,  మాజీ ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, గోగిరెడ్డి, పి.రమణారెడ్డి,రామిరెడ్డి, యువరాజు, కొండపనాయుడు పాల్గొన్నారు.


వాగ్దానాలను అమలు చేయాలి

నాయుడుపేట, ఆగస్టు 9 : ప్రభుత్వం తన వాగ్దానాలను అమలు చేయాలని సీఐటీయూ మండల కార్యదర్శి ముకుంద డిమాండు చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం స్కీమ్‌ వర్కర్లతో కలసి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు అదనపు వేతనం చెల్లించడంతోపాటు సేఫ్టీ పరికరాలను ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం జిల్లా అధ్యక్షురాలు విజయమ్మ, ఆశా వర్కర్ల జిల్లా కమిటీ సభ్యులు కృష్ణమ్మ, మణెమ్మ, అంగన్‌వాడీ ప్రాజెక్టు కార్యదర్శి శ్యామలమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-10T10:49:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising