ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాపంగా పామాయిల్‌ పరిశ్రమల కాలుష్యం

ABN, First Publish Date - 2020-12-31T03:32:02+05:30

అభివృద్థి పేరుతో వెలసిన పామాయిల్‌ పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం స్థానికుల పాలిట శాపంగా మారుతోంది. నిబంధనలకు నీళ్లొదిలి, పరిశ్రమల యాజమాన్యం ఇష్టారీతిన వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు

చెరువును తలపిస్తున్న పామాయిల్‌ వ్యర్థ జలాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 చెరువులను తలపిస్తున్న వ్యర్థజలాలు

 పశువులు మృతి, ప్రజలకు ఆనారోగ్యం

 పట్టించుకోని పీసీబీ

ముత్తుకూరు, డిసెంబరు 30 : అభివృద్థి పేరుతో వెలసిన పామాయిల్‌ పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం స్థానికుల పాలిట శాపంగా మారుతోంది. నిబంధనలకు నీళ్లొదిలి, పరిశ్రమల యాజమాన్యం ఇష్టారీతిన వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. కాలుష్య నియంత్రణ చేపట్టాల్సిన పరిశ్రమలు వ్యర్థజలాలను యఽథేచ్ఛగా వదిలివేస్తున్నారు. ఈ కాలుష్య జలాలను తాగిన పశువులు మృతి చెందుతున్నాయి. అంతేగాక ప్రజల ఆరోగ్యం ప్రమాదకరంగా మారుతోంది. ఈ దారుణ పరిస్థితి మండలంలోని పంటపాళెం పరిసర గ్రామాల్లో నెలకొని ఉంది. 


 అమలు కాని హామీలు


పంటపాళెం సమీపంలో 8 పామాయిల్‌ కంపెనీలు ఏర్పడ్డాయి. పరిశ్రమల ఏర్పాటు సమయంలో కాలుష్య నియంత్రణ, ప్రజారోగ్య పరిరక్షణ, స్థానికులకు ఉపాధి, పరిసర గ్రామాల అభివృద్థి చేస్తామని హామీల వర్షం కురిపించారు. పరిశ్రమలు ఏర్పడ్డాక ఏ ఒక్క హామీని నిలుపుకునేందుకు పామాయిల్‌ పరిశ్రమల యాజమాన్యం కృషి చేసిన దాఖలాలు లేవు. రోడ్డు పక్కనే పరిశ్రమల మధ్యలో ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థ జలాలను వదులుతున్నారు. ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లు పెట్టి వ్యర్థ జలాలను నిలువ చేసేందుకు ఈ ప్రాంతాన్ని చెరువులా మార్చేశారు. పట్టించుకోవాల్సిన కాలుష్య నియంత్రణ మండలి మామూళ్ల మత్తులో పడి కనీసం ఇటు వైపు చూడడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. 

  మామూళ్లు ఇస్తున్నాం కదా.?

 అధికారులకు మామూళ్లు ఇస్తున్నాం.. ఇక అడ్డు ఏముందన్న రీతిలో పామాయిల్‌ కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. పామాయిల్‌ ఫ్యాక్టరీల్లో కేవలం బొగ్గు మాత్రమే వాడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వరి పొట్టు వాడేందుకు లేదని గతంలో స్వయంగా ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి హెచ్చరించారు. అయినా ఇప్పటికీ యాజమాన్యా లు వరిపొట్టునే వాడుతున్నాయి. దీని వల్ల ఏర్పడే వాయు కాలుష్యం  ముత్తుకూరుకు వరకు వ్యాపించిందంటే, కాలుష్య ప్రభావం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అభివృద్థికి తాము అడ్డు కాదని, అయితే తమ ప్రాణాలతో చెలగాటమాడుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి., ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా పట్టించుకుని పామాయిల్‌ కాలుష్యం నుంచి ప్రజలను, మూగజీవాలను కాపాడాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2020-12-31T03:32:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising