7నుంచి వ్యర్థాలపై పోరాటం
ABN, First Publish Date - 2020-12-02T04:24:52+05:30
పారిశుధ్య అభివృద్ధికి ప్రభుత్వం వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం కార్యక్రమాన్ని అమలు చేయనుందని, ఈనెల 7 నుంచి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
నెల్లూరు(జడ్పీ), డిసెంబరు 1 : పారిశుధ్య అభివృద్ధికి ప్రభుత్వం వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం కార్యక్రమాన్ని అమలు చేయనుందని, ఈనెల 7 నుంచి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పారిశుధ్య పరిరక్షణపై ప్రజలను చైతన్యపరచడంతోపాటు అందరినీ భాగస్వాములను చేస్తామన్నారు. 7న జిల్లా కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించి ర్యాలీ నిర్వహిస్తారన్నారు. 8న మండల కేంద్రాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతాయన్నారు. 9న గ్రామ పంచాయతీస్థాయిలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే 10 నుంచి 20వ తేదీ వరకు స్వయంసహాయక సంఘాల లీడర్లు, శ్రమశక్తి సంఘాలు, విద్యార్థులు, రైతులు, ఎన్జీవోలతో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పూర్తిస్థాయిలో పారిశుధ్యం అభివృద్ధికి కృషి జరుగుతుందని ఇళ్ల నుంచే చెత్తను స్వీకరించే కార్యక్రమాన్ని చేపడతామని డీపీవో పేర్కొన్నారు.
Updated Date - 2020-12-02T04:24:52+05:30 IST