ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల్లో 901 పోస్టులు భర్తీ

ABN, First Publish Date - 2020-12-15T05:31:22+05:30

జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో 901 పోస్టులను భర్తీ చేసినట్లు జడ్పీ సీఈవో సుశీల ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో 528 ఖాళీలు 

జడ్పీ సీఈవో సుశీల 


నెల్లూరు(జడ్పీ), డిసెంబరు 14 : జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో  901 పోస్టులను భర్తీ చేసినట్లు జడ్పీ సీఈవో సుశీల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నాటికి 1261 పోస్టులు ఖాళీ ఉండగా వాటి భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిందన్నారు. దీనికి 54,191 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, సెప్టెంబరు 20 నుంచి 26 వరకు రాత పరీక్షలు నిర్వహించామన్నారు. అర్హత సాధించిన వారి సర్టిఫికెట్లు పరిశీలించి 901 మందిని వివిధ పోస్టుల్లో నియమించినట్లు పేర్కొన్నారు. రోస్టర్‌ ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు లేనందున 528 పోస్టులు భర్తీ కాలేదని, వాటికి మళ్లీ నోటిఫికేషన్‌కు పంపడం జరిగిందన్నారు. అలాగే స్పోర్ట్స్‌ కోటాలో 25 పోస్టులకు అభ్యర్థుల జాబితాను ఆ శాఖకు పంపామని, అర్హత కలిగిన వారిని నియమిస్తామని తెలిపారు.   

Updated Date - 2020-12-15T05:31:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising