ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యమంలో రైతులు అంతర్భాగం కావాలి

ABN, First Publish Date - 2020-12-31T05:07:38+05:30

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతు చట్టాలకు నిరసనగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంలో అందరు రైతులు అంతర్భావం కావాలని రైతు సంఘం నేతలు పిలుపునిచ్చారు.

దీక్ష చేస్తున్న రైతు సంఘాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 దీక్షలో రైతు సంఘం నేతలు 


నెల్లూరు (వైద్యం), డిసెంబరు 30 : కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతు చట్టాలకు నిరసనగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంలో అందరు రైతులు అంతర్భావం కావాలని రైతు సంఘం నేతలు పిలుపునిచ్చారు. బుధవారం రైతు సంఘాలు నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండు వద్ద దీక్ష చేపట్టారు. ఏపీ రైతు సంఘం నేతలు మాట్లాడుతూ ఆ చట్టాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. కరోనా కాలంలోనూ వ్యవసాయ రంగం దేశానికి అండగా నిలిచిందన్నారు. అటువంటి రంగాన్ని అంబానీ, ఆదాని, ఐటీసీ, పెప్సీ వంటి కంపెనీలకు అప్పగించేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశానికి పాలు, పండ్లు, కూరగాయలు, నూనె గింజలు, ఆహార ధాన్యాలు, పూలు అందించే కర్షకుల మెడకు ఉరితాళ్లు బిగించేలా  నూతన చట్టాలు ఉన్నాయని విమర్శించారు. రైతు ఉద్యమం నేపథ్యంలో గ్రామాల్లో దీక్ష శిబిరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, వెంగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకమరాజు, పుల్లయ్య, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్‌, జిల్లా కార్యదర్శి లక్ష్మిపతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T05:07:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising