ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేడుకగా అధ్యయనోత్సవాలు

ABN, First Publish Date - 2020-12-16T05:18:28+05:30

జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో మంగళవారం నుంచి అధ్యయనోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనువిందు చేసిన రంగనాథుని అలంకారాలు


నెల్లూరు(సాంస్కృతికం), డిసెంబరు 15 : జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో మంగళవారం నుంచి అధ్యయనోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు తల్పగిరి రంగనాఽథస్వామికి స్వర్ణ వైరముడి అలంకారం జరిగింది. అండాళ్‌ ఆలయంలో ఆళ్వార్ల ఘోష్టిగానం జరిగింది. అనంతరం శ్రీదేవి-భూదేవి సమేత రంగనాథస్వామికి ప్రాకారోత్ససవం నిర్వహించారు. ఈ నెల 25న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు పరిశీలించి పలు సూచనలు చేశారు.  ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ కోట గురుబ్రహ్మం, ధర్మకర్తలు, ఈవో వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.  మూలాపేటలోని రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలోనూ అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారిని స్వర్ణవైరముడితో కనుల పండువగా అలంకరించారు. అనంతరం ఆళ్వారుఘోష్టి, దివ్య నాలయర్‌ ప్రబంధ ఘోష్టి జరిగాయి. ఆలయ చైర్మన్‌ మన్నెం లక్ష్మినాథ్‌రెడ్డి, ధర్మకర్తలు, సహాయక కమిషనర్‌ జే శ్రీనివాసరావు, సిబ్బంది పర్యవేక్షించారు.  

Updated Date - 2020-12-16T05:18:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising