ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూడూరులో కుండపోత వర్షం

ABN, First Publish Date - 2020-12-04T03:44:03+05:30

పట్టణంలో గురువారం వేకువ నుంచి కుండపోత వర్షం కురిసింది.

తాత్కాలిక కూరగాయల మార్కెట్‌లో నిలిచిన నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, డిసెంబరు 3: పట్టణంలో గురువారం వేకువ నుంచి కుండపోత వర్షం కురిసింది. ఇప్పటికే నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో వాగులు, చెరువులు నిండిపోయాయి. బురేవి తుఫాన్‌ ప్రభావంతో కుండపోతగా వర్షం కురవడంతో పలు చెరువుల కలుజులు పొర్లుతున్నాయి. తాత్కాలిక కూరగాయల మార్కెట్‌లో నీరు నిలవడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు అవస్థలు పడ్డారు. పలు రోడ్లు జలమయమయ్యాయి.

చిల్లకూరు: మండలంలో గురువారం మధ్యాహ్నం జడివాన కురిసింది. వేకువ నుంచే విడతల విడతలుగా చిన్నపాటి వర్షం కురిసింది. మధ్యాహ్నం కురిసిన జడివానకు పలు వీధులు, రోడ్లుపై నీరు  ప్రవహించింది. చిల్లకూరు దళితవాడ సమీపంలోని ప్రధాన రహదారిపై మోకాటి లోతున నీరు ప్రవహించింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

వెంకటగిరి(టౌన్‌): తుఫాను కారణంగా పట్టణంలో గురువారం ఓ మోస్తరు వర్షం కురిసింది.  దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 


Updated Date - 2020-12-04T03:44:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising