ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జల దిగ్బంధంలో ఏఎస్‌పేట

ABN, First Publish Date - 2020-11-28T05:21:43+05:30

ఏఎస్‌పేట-నెల్లూరు మార్గంలోని నక్కలవాగు వంతన పైనుంచి నీరు పొంగి ప్రవహిస్తోంది. ఏఎస్‌పేట-ఆత్మకూరు మార్గంలో తెల్లపాడు సమీపంలో రోడ్డుపై నీరు ప్రవహిస్తుండడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణంలోని షాపబావి సెంటర్‌, బస్టాండ్‌ సెంట

పొంగి ప్రవహిస్తున్న నక్కల వాగు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఎ్‌సపేట, నవంబరు 27: ఏఎస్‌పేట-నెల్లూరు మార్గంలోని నక్కలవాగు వంతన పైనుంచి నీరు పొంగి ప్రవహిస్తోంది. ఏఎస్‌పేట-ఆత్మకూరు మార్గంలో తెల్లపాడు సమీపంలో రోడ్డుపై నీరు ప్రవహిస్తుండడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణంలోని షాపబావి సెంటర్‌, బస్టాండ్‌ సెంటర్‌ ప్రాంతం, శ్రీకొలను గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి నీరు చేరింది. గండువారుపల్లి, పందిపాడు, హబ్బీపురం తదితర గ్రామాలలో సేకరించిన పాలు తీసుకెళ్లే మార్గం లేక లీటరు పాలను రూ.20లకే విక్రయించారు. దీంతో ప్రజలు ఎగబడి కొన్నారు. మండలంలో 950 హెక్టార్లు మినుము, 25 హెక్టార్లు పెసర, 22 హెక్టార్లు ఉలవలు, 9 హెక్టార్లు జొన్న పంటలు నష్టపోయినట్లు ఏవో రజని అంచనా వేశారు. ఏఎస్‌పేటతో పాటు కావలియడవల్లి గ్రామంలో మగ్గం గుంతలలో వర్షపు నీరు చేరింది.

 

Updated Date - 2020-11-28T05:21:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising