ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికార పార్టీ నేతల నుంచి రక్షణ కల్పించండి

ABN, First Publish Date - 2020-04-08T10:59:19+05:30

విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలపై చట్టరీత్యా చర్యలు చేపట్టి న్యాయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరికుంటపాడు, ఏప్రిల్‌ 7: విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలపై చట్టరీత్యా చర్యలు చేపట్టి న్యాయం చేయాలని స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఎదు ట మంగళవారం సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. తోటలచెరువుపల్లి సచివాలయంలో విధులు నిర్వహిస్తు న్న పిక్కిలి హసనయ్యపై సమీప యర్రంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు నాదెండ్ల రమేష్‌, రాయవరపు నారాయణలు సోమవారం దాడికి పాల్పడిన విషయం విదితమే.


ఆ ఉద్యోగికి మద్దతు గా 12 సచివాలయాల పరిధిలోని ఉద్యోగులతో పాటు కార్యాలయ ఉద్యోగులు సైతం నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలకు తట్టుకుని ఉద్యోగాలు చేయాలంటేనే భయ మేస్తుందని వాపోయారు. ఇటీవల పెద్దిరెడ్డిపల్లి సచివాలయ మహిళా ఉద్యోగినిపై కూడా దౌర్జన్యానికి పాల్పడ్డారని తమకు ఎలాంటి సమయం లో ఎటువంటి ముప్పు ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. అనంత రం తమకు రక్షణ కల్పించాలని ఎంపీడీవో సురేష్‌బాబు, తహసీల్దారు శ్రీనివాసులుకు వినతిపత్రాలు అందచేశారు. 


కేసు నమోదు: ఈ విషయమై ఎస్సై ఉమాశంకర్‌ మాట్లాడుతూ తమ కు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. గ్రామానికి వెళ్లి సచివాలయ ఉద్యోగులు, ప్రజలను విచారించడం జరిగిం దన్నారు. త్వరలోనే దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. 

Updated Date - 2020-04-08T10:59:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising