ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద బాధితులకు అగ్నిమాపక శాఖ రక్షణ

ABN, First Publish Date - 2020-11-29T05:15:35+05:30

నివార్‌ తుఫానుతో జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాల వాసులు వరద నీటిలో చిక్కుకున్నారు. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని కాపాడేవారి కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఈ తరుణంలో ‘మేమున్నామంటూ అగ్నిమాపక శాఖ సిబ్బంది వారిలో ధైర్యం నింపారు.

బాధితులను రక్షిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు సేవలు

నెల్లూరు(క్రైం)నవంబరు 27: నివార్‌ తుఫానుతో జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాల వాసులు వరద నీటిలో చిక్కుకున్నారు. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని కాపాడేవారి కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. ఈ తరుణంలో ‘మేమున్నామంటూ అగ్నిమాపక శాఖ సిబ్బంది వారిలో ధైర్యం నింపారు. నీటికి ఎదురెళ్లి వరదలో చిక్కుకున్న ప్రజలను రక్షించారు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా  అగ్ని మాపక అధికారులు, సిబ్బంది ప్రజా సేవలో ఉండిపోయారు. జిల్లాలో 13  అగ్నిమాపక యంత్ర కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 260 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. తుఫాను ముందస్తు హెచ్చరికలు జారీ అవగానే జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కె. శ్రీకాంత్‌రెడ్డి సెలవులో ఉన్న అధికారులు, సిబ్బంది  విధులకు హాజరు కావాలని, తుఫాను ప్రభావం తగ్గే వరకు సెలవులు ఇవ్వబోమని ఆదేశాలు జారీ చేశారు. దీంతో తుఫాను ప్రారంభమయ్యే సరికే సిబ్బంది అంతా విఽధులకు హాజరయ్యారు. మూడు రోజులు పాటు రాత్రి పగలు అన్న తేడా లేకుండా ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు సేవలందించారు.

నిరంతరం ప్రజా సేవలోనే:  కె శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి

నివర్‌ తుఫాన్‌ హెచ్చరికలు జారీ అయినప్పటి నుంచీ సిబ్బందిని అప్రమత్తం చేశాం. సెలవులు రద్దు చేసి అందరూ విధులకు హాజరయ్యేలా చూశాం. జిల్లాలోని నెల్లూరు, కావలి, ఆత్మకూరు ప్రాంతాల్లో బోట్లు అందుబాటులో ఉంచాం. నిరంతరం సేవలు అందించాం. డిసెంబరు రెండో వారం వరకు సిబ్బంది సేవలు నిరంతరం అందిస్తుంటారు.

Updated Date - 2020-11-29T05:15:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising