ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబ్బులు తీసుకుని ప్లాట్లు కేటాయించారు

ABN, First Publish Date - 2020-07-06T10:42:12+05:30

బ్బులు ఇచ్చిన వారికే ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పేదలకు అన్యాయం జరిగిందని వైసీపీ రైతు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వైసీపీ రాష్ట్ర స్థాయి నేత ఆరోపణ


 రాపూరు, జూలై 5 : డబ్బులు ఇచ్చిన వారికే ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంతో పేదలకు అన్యాయం జరిగిందని వైసీపీ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు, రాపూరు జడ్పీటీసీ మాజీ సభ్యుడు బత్తిన పట్టాభిరామిరెడ్డి ఆరోపించారు.  రాపూరు పట్టణ పరిధిలోని లేఔట్‌ వద్ద  తహసీల్దారు, రెవెన్యూ సిబ్బంది, ఆదివారం ప్లాట్ల కేటాయింపు కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా వచ్చిన బత్తిన ఎంపిక చేసినవారి జాబితాలో అర్హుల పేరుల లేకపోవడంతో అవాక్కయ్యారు. దీంతో కార్యక్రమాన్ని బహిష్కరించి బయలుదేరారు. 


ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఒకటి, రెండు మిద్దెలు ఉన్న వారికే మళ్లీ స్థలం మంజూరు చేశారని,  డబ్బులు తీసుకుని పట్టాలు మంజూరు చేశారని, అసలు సర్వే కూడా చేసినట్లుగా లేకపోవడంతో తాను ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పి వెళ్లిపోయారు. అనంతరం లక్కీ డిప్‌ ద్వారా అధికారులు ప్లాట్ల కేటాయింపు కార్యక్రమాన్ని కొనసాగించారు.  పట్టణ పరిధిలో 421 మందికి లక్కీ డిప్‌ ద్వారా స్థలాలు కేటాయించినట్లు తహసీల్దారు మధుసూదనరావు తెలిపారు.  అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 

Updated Date - 2020-07-06T10:42:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising