పెన్నక్క చెరువుకు స్వర్ణముఖి జలాలు
ABN, First Publish Date - 2020-12-30T02:19:13+05:30
మండలంలోని నెల్లూరుపల్లి కొత్తపాళెం వద్ద వున్న పెన్నక్క చెరువు, కొక్కుపాడు చెరువుల్లోకి మంగళవారం
కోట, డిసెంబరు 29 : మండలంలోని నెల్లూరుపల్లి కొత్తపాళెం వద్ద వున్న పెన్నక్క చెరువు, కొక్కుపాడు చెరువుల్లోకి మంగళవారం స్వర్ణముఖి జలాలు చల్లకాలువ నదిమీదుగా వెళ్లాయి. స్వర్ణముఖిలోకి ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు, మామిడి, చల్లకాలువ నదుల్లోకి చేరిన ఊట నీరు గూడలి వద్ద వున్న స్వర్ణముఖి నదిలోకి చేరుతున్నాయి. ఆ నీరంతా వృథాగా వాకాడు బ్యారేజీలోకి వెళ్లకుండా కాలువల ద్వారా చల్లకాలువ నది మీదుగా పెన్నక్క చెరువులోకి పంపి ఆ చెరువు కింద వున్న 6 వేల ఎకరాల ఆయుకట్టు భూములకు సాగు నీరు అందించేందుకు నీరుపారుదల శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. అలాగే కొక్కుపాడు చెరువులోకి పంపి ఆ చెరువు కింద వున్న మరో 450 ఎకరాల ఆయుకట్టు భూములకు ఈ నీటిని అందించాలన్న ఉద్దేశంతో స్వర్ణముఖి జలాలను ఆయా శాఖ అధికారులు కాలువల ద్వారా రైతులు ఆఽధ్వర్యంలో మళ్లించుకుంటున్నారు.
Updated Date - 2020-12-30T02:19:13+05:30 IST