ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేనేతల సమస్యలపై పోరాటం

ABN, First Publish Date - 2020-12-06T04:03:22+05:30

ఛిద్రమవుతున్న చేనేతల సమస్యలపై పోరాటం సాగిస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

వెంకటగిరి టౌన్‌ : భారీగా తరలివచ్చిన అభిమానులనుద్దేశించి మాట్లాడుతున్న పవన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళగిరికి వెళ్లి ప్రభుత్వంతో చర్చిస్తా

మీ సమస్యలపై ఎమ్మెల్యేలను నిలదీయండి

గుండె నిండా నెల్లూరు అభిమానులే

రోడ్‌షోలలో జనసేనాని పవన్‌

జోరువర్షంలోనూ తరలివచ్చిన అభిమానులు

వెంకటగిరి(టౌన్‌)/నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట)/కోవూరు/గూడూరు, డిసెంబరు 5 :  ఛిద్రమవుతున్న చేనేతల సమస్యలపై పోరాటం సాగిస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. శనివారం వెంకటగిరికి వచ్చిన ఆయనకు అభిమానులు పూలవర్షంతో స్వాగతం పలికారు. నెల్లూరు నుంచి కోవూరు మండలం ఇనమడుగు రోడ్డు కూడలికి చేరుకుని అభిమానులతో మాట్లాడారు. నెల్లూరులోని భగత్‌సింగ్‌ కాలనీలో ప్రభుత్వం పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన జగనన్న లేఅవుట్‌ను  పవన్‌ కల్యాణ్‌ పరిశీలించారు. చిన్న వర్షాలకే ఈ స్థలాలు  మునుగుతుంటే ఇక ఇళ్లు నిర్మించుకుంటే ప్రజలు ఏవిధంగా  నివాసం ఉండాలని ప్రశ్నించారు. ఆ తర్వాత గూడూరు సమీపంలో జాతీయరహదారిపై ప్రవహిస్తున్న వరదను పవన్‌ పరిశీలించారు. అక్కడ నుంచి జనసేన అభిమానుల ఆధ్వర్యంలో పట్టణంలోని టవర్‌క్లాక్‌ సెంటర్‌ వరకు వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ. 35వేలు పరిహారం చెల్లించాలన్నారు. తక్షణం పదివేల సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో అనే ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయని, కాలుష్య నివారణపై జనసేన పోరాడుతుందని స్పష్టం చేశారు. తిప్పవరప్పాడు చేరుకుని జనసేన పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తీగల చంద్రశేఖర్‌, అల్లం బాబు, నయూం, విజయ్‌, గోవర్ధన్‌, కరీముల్లా, కొట్టే వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు బైరప్ప, గాలి ప్రకా్‌షనాయుడు, పాలవల్లి మౌనీష్‌, తూపిలి దినకర్‌, చిన్నా, కోటి తదితరులు పాల్గొన్నారు. 


అభిమానులే నడిపిస్తున్నారు.

‘‘గుండె నిండా నెల్లూరు అభిమానమే కనిపిస్తోంది. వీరే నాకు అండగా ముందుండి నడిపిస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వెంకటగిరిలో ఆయన మాట్లాడుతూ వెంకటగిరి చేనేతకు ప్రపంచ ఖ్యాతి ఉన్న వారి ఎదుగుదల కనిపించడం లేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక చేనేత సమస్యలను పరిష్కరించే వారే కరువయ్యారని విమర్శించారు. వరదల వల్ల నష్టపోయిన చేనేత కుటుంబానికి రూ.35 వేలు ఆర్థిక సాయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చేనేతలకు అండగా జనసేన ముందుండి, వారి సమస్యలపై మంగళగిరికి వెళ్లి ప్రభుత్వంతో పోరాడుతానని చెప్పారు. వెంకటగిరి ఎమ్మెల్యే ప్రజా సమస్యలు మరిచి సొంత పనులు చేసుకుంటున్నారని ఎద్దేవా వేశారు. అటువంటి వారిని (ఎమ్మెల్యేలను) నిలదీసి అడిగే హక్కు ప్రజలకు మాత్రమే ఉందన్నారు. పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అభివృద్ధిని దూరం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌కు దమ్ముంటే ఎన్నికల హామీలు నెరవేర్చి అభివృద్ధిపై దృష్టి సారించాలని సవాల్‌ విసిరారు. రైతు సమస్యలపై త్వరలో జిల్లాలో సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు.  



Updated Date - 2020-12-06T04:03:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising