ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లిదండ్రుల అంగీకారపత్రం తప్పనిసరి!

ABN, First Publish Date - 2020-09-20T10:07:40+05:30

సోమవారం నుంచి ఉన్నత పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్‌ తెలిపారు. శనివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 రేపటినుంచి పాఠశాలల పునఃప్రారంభం

 పది రోజుల కార్యాచరణ రూపకల్పన

‘ఆంధ్రజ్యోతి’తో డీఈవో రమేష్‌


నెల్లూరు(స్టోన్‌హౌ్‌సపేట), సెప్టెంబరు 19 : సోమవారం నుంచి ఉన్నత పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్‌ తెలిపారు. శనివారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ 9, 10 తరగతులతోపాటు ఇంటర్‌ విద్యార్ధులకు బోధన జరుగుతుందన్నారు. విద్యార్థుల హాజరుకు సంబంధించి తల్లిదండ్రుల అంగీకార పత్రం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.


ఇక  పాఠశాలల నిర్వాహణపై ప్రధానోపాధ్యాయులకు పదిరోజుల కార్యాచరణ రూపకల్పన చేసి ఇచ్చినట్టు చెప్పారు. తొలిరోజు ఉపాధ్యాయులంతా తప్పనిసరిగా పాఠశాలలకు రావాలని, 22 నుంచి 50 శాతం మంది ఉపాధ్యాయులు హాజరయ్యేలా జాబు చార్టు సిద్ధం చేసుకోవాలని సూచించినట్లు చెప్పారు.


ఉపాధ్యాయులు, విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. జగనన్న విద్యాకానుక రాష్ట్ర ప్రభుత్వం సూచించిన తేదీకి ఇవ్వడం జరుగుతుందన్నారు.

  ఇక నాడు-నేడు పనులు త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. 

Updated Date - 2020-09-20T10:07:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising