పంపిణీకి సిద్ధంగా లేఅవుట్లు
ABN, First Publish Date - 2020-12-30T02:29:52+05:30
జనవరి 3న ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు లే అ
- పరిశీలించిన నేతలు
బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు29: జనవరి 3న ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు లే అవుట్‌లు సిద్ధమయ్యాయి. వీటిని తహసీల్దారు, ఎంపీడీవో, హౌసింగ్ ఏఈ, ఇతర అధికారులు, వవ్వేరు బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి మంగళవారం వేర్వేరుగా పరిశీలించారు. లే అవుట్లలో లెవలింగ్ రోడ్లు ఏర్పాటు చేయిస్తున్న గ్రామ రెవెన్యూ అఽధికారులు,సర్వేయర్లు, వలంటీర్లుకు సూచనలిచ్చారు. మండలంలోని చెల్లాయపాళెం, మినగల్లు, రేబాల గ్రామాలో లే అవుట్లను వవ్వేరు బ్యాంకు చైర్మన్, దామరమడుగు, మునులపూడి గ్రామాలలోని లే అవుట్లను తహసీల్దారు షఫీమాలిక్, ఎంపీడీవో నరసింహరావు, హౌసింగ్ ఏఈ గౌస్ మొహిద్దీన్ పరిశీలించారు. వీరి వెంట వైసీపీ నాయకులు, ద్వారకానాధరెడ్డి, శ్రీహరి, మఽధు, భక్తవత్సలరెడ్డి, నిరంజన్‌రెడ్డి, రమణారెడ్డి, అహ్మద్‌భాషా, మురళి, వెంకయ్య తదితరులు వున్నారు.
Updated Date - 2020-12-30T02:29:52+05:30 IST